పౌర హక్కుల ఉద్యమనేత, దిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జి. ఎన్. సాయిబాబాది సర్కారు హత్య అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన ప్రొఫెసర్ సాయిబాబాకు చల్లపల్లిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ 90 శాతం అంగవైకల్యంతో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను పదేళ్ల పాటు అక్రమంగా నిర్బంధించి అతి క్రూరంగా హింసించారన్నారు.