అసత్య ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ చిత్రపటాలు ఉన్న ఫ్లెక్సీ ని తగలబెట్టిన బడే గౌతమ్ పై కోడూరు పోలీస్ స్టేషన్ లో మండల టిడిపి,
జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. శుక్రవారం కోడూరు ఎస్సై చాణిక్యకు ఈ ఫిర్యాదు అందించారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల
టీడీపీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు, కూటమి నేతలు పాల్గొన్నారు.