కోడూరు పంచాయతీ శివారు యర్రారెడ్డిపాలెంలోని ఊర చెరువులో పిచ్చిమొక్కలు, తుంగతో నిండిపోయింది. చెరువులోని నీరు చుట్టుపక్కల గృహాల చెంతకు చేరడంతో దోమలు విజృంభిస్తూ విష జ్వరాల బారిన పడుతున్నామని ప్రజలు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఊర చెరువులోని మురుగునీరు, పసరెక్కిన నీరు బయటకు పోయే బోదు పూడిపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు. పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరారు.