ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రతినిధులు సోమవారం గుంటూరు, అమరావతిలోని వ్యవసాయ పరిశోధనా స్థానాలను సందర్శించారు. భూసార పరీక్షా విధానం, ఆవశ్యకత, మరియు భూసార పరీక్షా ఫలిత ఆధారిత ఎరువుల యాజమాన్యం, సమస్యాత్మక భూముల యాజమాన్యం తదితర అంశాలను మృతిక విభాగ శాస్త్రవేత్త డా. సుజనీ రావు వివరించారు. కెవికె శాస్త్రవేత్తలు సుధారాణి, రేవతి పాల్గొన్నారు.