ఘంటసాల మండల పరిధిలోని పాపవినాశనం గ్రామ ఆది ఆంధ్ర ఫీల్డ్ లేబరు కో-ఆపరేటివ్ సొసైటీకి చెందిన భూమిని ఒక వ్యక్తి ఆక్రమించుకున్నారని రైతులు పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు చర్యలు చేపట్టి భూమిని ఇప్పించాలని కోరుతూ సొసొసైటీ సభ్యులు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కు సభ్యులు విన్నవించి వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై వైస్ ఎంపీపీ కుంపటి నాగేంద్రబాబు మాట్లాడుతూ మునిపల్లి బుజ్జి ఆక్రమించుకున్నారని తెలిపారు.