చల్లపల్లి మండలం రామానగరంలో హిందూ స్మశానవాటిక ఆవరణలో మద్యం షాపు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వద్దంటూ మహిళలు తహసీల్దార్ కార్యాలయంలో డీటీ శ్రీలతకు వినతిపత్రం బుధవారం అందించారు. షాపు ఏర్పాటుచేసే ప్రదేశం యాక్సిడెంట్ జోన్ అనీ, మద్యం షాపు ఏర్పాటుతో ఆ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారుతుందన్నారు. మద్యం షాపు ఏర్పాటుతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.