దివిసీమ జల వనరుల శాఖ డీఈఈగా పులిగడ్డ వెంకటేశ్వరరావు శుక్రవారం నియమితులయ్యారు. ఇప్పటి వరకు అవనిగడ్డ సబ్ డివిజన్ డ్రైనేజీ శాఖ ఇన్ఛార్జి డీఈఈగా, ఇరిగేషన్ ఏఈగా విధులు నిర్వహించిన వెంకటేశ్వరరావుకు పులిగడ్డ సబ్ డివిజన్ డీఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉంటా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల వచ్చిన వరదల్లో వెంకటేశ్వరరావు ఉత్తమ పనితీరు కనబరిచారు.