బాణాసంచా దుకాణాల వద్ద ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు ఆదేశించారు. సోమవారం అవనిగడ్డ డిగ్రీ కళాశాల మైదానంలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయనున్న ప్రదేశాన్ని ఆయన ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అవనిగడ్డలో మొత్తం 15 దుకాణాలకు అనుమతులు ఇచ్చామని, దుకాణాల వద్ద ఎలాంటి భద్రత వైఫల్యాలు ఉన్నా అమ్మకాలు నిలిపివేస్తామని తెలిపారు.