సిఆర్జెడ్ పరిధిలో లేని ఆరు ప్రాంతాలలో ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తహశీల్దార్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. సోమవారం అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని కొత్తపేట, దక్షిణ చిరువోలు లంక, వేకనూరు, తుంగలవారిపాలెం, పాత ఎడ్లంక, పులిగడ్డ గ్రామాల్లో ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేస్తే ఎందుకు అనువుగా ఉంటుందని జాయింట్ కలెక్టర్ కు నివేదిక పంపినట్లు తెలిపారు.