AP: అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్‌ను ట్రాక్‌లో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2024-25 వార్షిక బడ్జెట్లో ఆ సంస్థకు రూ.50 కోట్లు కేటాయించింది. భూ సేకరణ పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు అయ్యే ఖర్చును దశల వారీగా కేటాయించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి లేఖ రాసి మెట్రో ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు.