మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా దుద్యాల మండలం లగచర్లలో తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో సోమవారం సాయంత్రం పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఫార్మావిలేజ్ ను భూసేకరణ విషయంలో సోమవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అధికారులపై గ్రామస్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చి, నిందితులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.