పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు పట్టణ శివారు జగనన్న కాలనీలో భారీ వర్షాలకు తోడు ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ముంపునకు గురయ్యారు. ఆ ప్రాంత ప్రజలను సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో ముంపునకు గురైన ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం సహాయకారిగా నిలుస్తుందని తెలిపారు. వరద ప్రాంతాల్లో అధికారులు అండగా నిలిచి నిత్యావసర వస్తువులు అందేలా చూడాలన్నారు.