గ్రామ, మండల, జిల్లాపరిషత్ లలో రానున్న ఆర్థిక సంవత్సరాలకు ప్రణాళికలు రూపొందించే అంశాలపై.. నాలుగు జిల్లాల అధికారులకు రెండు రోజుల శిక్షణా తరగతులు శనివారం సామర్లకోట విస్తరణ శిక్షణా ఇంద్రం ఆవరణలో నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులను ఈటీసీ ప్రిన్సిపాల్ జే. వేణుగోపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్, జీ. రమణ, ఆంజనేయులు, కే. శ్రీనివాస రావు, ప్రసాద్, నీహారిక పాల్గొన్నారు.