చాగల్లు మండలం నెలటూరు, ఊనగట్ల తదితరు గ్రామాల్లో బుధవారం కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని నెలటూరు ఆర్బికే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసే విధానాలను, రైతులకు అందుతున్న తక్షణ సేవలను సిబ్బందిని, రైతులను అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాలో సొమ్ము జమ చేయబడుతుంది అన్నారు.