మండల కేంద్రమైన ఆత్రేయపురంలోని సత్యసాయి సేవ కేంద్రం నందు శనివారం వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటలు వరకు ప్రముఖ వైద్యులు డాక్టర్ సందీప్ రెడ్డి చే ఎముకలు, కీళ్ళు వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తామని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.