అనపర్తి నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వ ర్యంలో కాకినాడ కాలువపై అసంపూర్తిగా ఉన్న మూడు వంతెనలను పూర్తిచేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ సుమారు 12 ఏళ్ల నుంచి కాకినాడ కెనాల్ పై మూడు వంతెనలు అసంపూర్తిగా ఉన్నాయని సుమారు 4 కోట్లు వెచ్చిస్తే మూడు వంతెనలు వినియోగంలోకి వస్తాయన్నారు.