బిక్కవోలు ప్రసిద్ధ శ్రీలక్ష్మీగణపతి స్వామివారి ఆలయం చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే పలు ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజూమున 1: 59 గంటలకు తీర్ధపు బిందె సేవతో మొదలైన చవితి ఉత్సవాలు 9వ రోజు మహాన్నదానంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.