వేంపల్లిలో విలేకరి దస్తగిరి రెడ్డి పై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని అన్నమయ్య జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులు కోరారు. సోమవారం వారు మాట్లాడుతూ నెల రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి యాంకర్ ను వేధిస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దస్తగిరిపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. అక్రమంగా పెట్టిన కేసును తొలగించి మీడియా హక్కులను కాపాడాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ను కోరారు.