అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని బోయినపల్లి ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి వారిచే ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గలవారు వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.