అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వo ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని, మద్యం టెండర్ల ద్వారా తన సొంత ఖజానా నింపుకోవాలని చూస్తున్నారని రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. సోమవారం రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలు చేయకపోగా డైవర్షన్ పాలిటిక్స్ చేశారని అన్నారు.