చిట్వేలు మండలంలో గత నెల జరిగిన చోరీ కేసును చిట్వేలు పోలీసులు ఛేదించారు. చిట్వేలు అంబేద్కర్ విగ్రహం వద్ద అనంతపురం ఇరాని గ్యాంగ్ చెందిన నలుగురు వ్యక్తులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1, 12, 000 విలువ చేసే బంగారు చైను, మోటార్ సైకిల్ ను రికవరీ చేసినట్లు రైల్వే కోడూరు గ్రామీణ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో చిట్వేలు ఎస్సై రఘురాం పాల్గొన్నారు.