పులివెందుల: వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఇంటికి సోమవారం ఉదయం పులివెందుల డిఎస్పి మురళి నాయక్, సీఐ జీవన్ గంగానాథ్ బాబు వెళ్లారు. గతంలో సిబిఐ పై ప్రైవేట్ కేసు విషయమై విచారణ చేస్తున్నట్టు తెలిపారు. కృష్ణారెడ్డి తరపున లాయర్ల సమక్షంలో కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేసుకున్నారు. ఇటీవల సునిత హోం మంత్రి అనిత, కడప ఎస్పీని కలిసి వివేకానంద హత్య కేసు విచారణ చేయాలని కోరారు.