మండల కేంద్రమైన సింహాద్రిపురంలో సోమవారం తాడిపత్రి నుంచి పులివెందులకు వెళుతున్న ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఎదురుగా వస్తున్న కారును ఆర్టీసీ డ్రైవర్ తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.