వేంపల్లిలో 100 ఎకరాల్లో నేలకొరిగిన వరి పంట

51பார்த்தது
వేంపల్లిలో 100 ఎకరాల్లో నేలకొరిగిన వరి పంట
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా కురిసిన వర్షాలకు బుధవారం వేంపల్లి మండలం అలిరెడ్డి పల్లె, ఇడుపులపాయ, వేంపల్లి, కుమ్మరాంపల్లి గ్రామాల్లో దాదాపు 100 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. నేలకొరిగిన వరి పంటను మండల వ్యవసాయ అధికారి రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పంట వర్షానికి నేలకొరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

தொடர்புடைய செய்தி