కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం కలమల్లలోని ఏపీ జెన్కో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విజిలెన్స్ సీఐగా నారాయణ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం నారాయణ యాదవ్ బాధ్యతలను చేపట్టి విద్యుత్ చౌర్యానికి గురి కాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈయన గతంలో ప్రొద్దుటూరు ఫాక్షన్ జోన్, ప్రొద్దుటూరు త్రీటౌన్, కడప రెడ్ శాండిల్లో సీఐగా పనిచేశారు.