అన్నమయ్య జిల్లాలో 333 తాత్కాలిక టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చామని జిల్లా అగ్నిమాపక అధికారి అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం మదనపల్లి అగ్నిమాపక కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందజేశారు. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.