కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలంగాణకు వెళ్లనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆయనను తెలంగాణ క్యాడర్ కు కేటాయించినా, ఏపీలో కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణాల్లోని పలువురు ఐఏఎస్ క్యాడర్ పై స్పష్టతనిచ్చి రిలీవ్ కావాలని ఆదేశించింది. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే వారిలో శివశంకర్ కూడా ఉన్నారు. ఆయన జులై 6న కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించలేదు.