బద్వేల్: మహిళలపై పెరిగిన దాడులు, అఘాయిత్యాలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలపై దాడులు అధికం అయ్యాయని బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా ఆరోపించారు. బద్వేలులో ఆమె మాట్లాడుతూ. ఇటీవల ఉన్మాది చేతిలో బలైన దస్తగిరమ్మ కుటుంబానికి ఇచ్చిన మాట ప్రకారం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చెక్కును అందజేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం వీరికి మరింత ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. వీరికి వైసీపీ తరఫున ఎల్లప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.