నగరం గ్రామంలోని శ్రీ పక్కలమ్మ అమ్మవారి దేవస్థాన ఆవరణలో ఆదివారం ఆర్యవైశ్య సంఘీయుల కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రచార సంఘ అధ్యక్షులు పెర్ల నాగేశ్వరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వన సమారాధన నిర్వహించడం ద్వారా ఆర్య వైశ్య సంఘీయులందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు.