రేపల్లె :ప్రజలపై విద్యుత్ భారం మోపటం తగదు

578பார்த்தது
విద్యుత్ ట్రూ అప్ చార్జీల పేరుతో 6072 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపుతూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణి లాల్ డిమాండ్ చేశారు. ఆదివారం రేపల్లె సిపిఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం అదనపు ధరకు విద్యుత్ కొనుగోలు చేసిందనే సాకుతో కూటమి ప్రభుత్వం ప్రజల నెత్తిన విద్యుత్ భారం మోపుతుందన్నారు.ప్రభుత్వం పునరాలోచించి ప్రజలపై విద్యుత్ భారం తగ్గించాలన్నారు.

தொடர்புடைய செய்தி