గుంటూరులో జూ. ఎన్టీఆర్ 'దేవర' సక్సెస్ మీట్
జూ. ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా ఈనెల 27న రిలీజై భారీ వసూళ్లు రాబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలంలో అక్టోబర్ 3న ఫంక్షన్ ఏర్పాటుకు సోమవారం నిర్వహకులు స్థల ఏర్పాట్లు పరిశీలించినట్లు తెలుస్తోంది. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ నిర్వహించనుండగా చిత్రయూనిట్ పాల్గొననున్నట్లు సమాచారం.