విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని పొన్నూరు తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ అన్నారు. మంగళవారం పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామం జడ్పీ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం తీరు ను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. బియ్యం స్టాక్ రిజిస్టర్ విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. నిబంధన ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని ఏజెన్సీ వారిని కి సూచించారు.