పొన్నూరు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, కార్యాలయ సిబ్బంది, కూటమి శ్రేణులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం రచించిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మహోన్నత వ్యక్తి అని కమిషనర్ రమేష్ బాబు కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు మాట్లాడారు.