నరసరావుపేటలోని సబ్ జైల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా నాయకులను మంగళవారం మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించడానికి వచ్చారు. ఈ కార్య క్రమంలో అంబటి రాంబాబుతో నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.