నరసరావుపేట మండలం కోటప్పకొండ తిరుణాళ్లకు సంబంధించి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు డీఎస్పీ కె. నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొండకు వెళ్లే మార్గాలను సిద్ధం చేయడం, చెక్ పోస్టుల ఏర్పాటు, ప్రభల నిర్మాణాలపై అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శృంగేరి పీఠాధిపతి భారతీయ మహాస్వామి పర్యటనకు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు.