రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్భార్ కు బుధవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం సిబ్బంది మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాదర్భార్ తిరిగి ఎప్పుడు నిర్వహించేది ఒక రోజు ముందుగా తెలియచేస్తామని తెలిపారు. కావున దూర ప్రాంతాల నుంచి ప్రజాదర్భార్ కు వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.