రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పేరిట పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమాన్ని మంగళగిరిలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రారంభించారు. ఎంటీఎంసీ కమిషనర్ అలీం భాషా, పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అబద్దయ్య పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లి నగదును అందజేశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్ నగదును అందుకున్నారు.