పిడుగురాళ్ల మండలంలోని కామేపల్లి గ్రామంలో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కరాలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి క్యాన్సర్ ఎన్ని రకాలు, వాటిని ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలనే అంశాలపై ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాయి, ఏఎన్ఎం కృష్ణకుమారి, దుర్గేష, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.