పిడుగురాళ్ల పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో భేటీ బచావో బేటి పడావో వాల్ పోస్టర్ ను శుక్రవారం ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రామకృష్ణ హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టాలని, బాలల సంరక్షణకు సంబంధించిన చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొటెక్షన్ అధికారి రామకృష్ణారెడ్డి, ఐసిడిఎస్ రుక్సానా బేగం, తదితరులు పాల్గొన్నారు.