మాచవరం మండలం చెన్నాయపాలెంలోని సరస్వతి భూముల పరిశీలనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాంబు స్కాట్ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చెన్నైపాలెం, వేమవరం గ్రామాలను సీఆర్పీఎఫ్ పోలీస్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు