కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రూ. 8 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. రాజగారి తోటలో రూ. 10లక్షలతో డ్రైన్లు, శారదాకాలనీలో రూ. 75లక్షలతో డ్రైన్లు, మంచినీటి పైపు నిర్మాణ పనులకు బుధవారం నసీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. నగరాభివృద్ధి లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సజీలా, సమత పాల్గొన్నారు.