కృష్ణా : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానిపురం 40డివిజన్లో ఉద్యోగాల పేరట కోటి 30 లక్షల రూపాయలు స్వాహా. ప్రజలకు మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భవానిపురానికి చెందిన కార్లు వ్యాపారం చేసే అహ్మద్, లాయర్ వెంకటరమణ అతని అసిస్టెంట్లు ముగ్గురు కలిపి ఉద్యోగాలు ఇప్పిస్తామని కోటి 30 లక్షలు వసూలు చేశారు. శనివారంబాధితులు ముగ్గురిని పట్టుకుని భవానిపురం పోలీస్ స్టేషన్ కి అప్పగించారు.