ఏలూరు నుంచి ఉండ్రాజవరం గ్రామానికి 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా భీమడోలు రైల్వే గేటు వద్ద విజిలెన్స్, రెవెన్యూ, పౌర సరఫరాల విభాగం అధికారులు పట్టుకున్నారు. ఏలూరుకు చెందిన జన్యావుల సుధాకర్, వ్యాన్ డ్రైవర్ బీటీఎస్ మణికంఠ, ఉండ్రాజవరానికి చెందిన బాషాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో జన్యావుల సుధాకర్, డ్రైవర్ మణికంఠలను అరెస్ట్ చేసి భీమడోలు కోర్టులో హాజరు పరిచారు.