కొయ్యలగూడెం: ఆసుపత్రి భవనంపై చెలరేగిన మంటలు
కొయ్యలగూడెం ప్రధాన రహదారిపై ఉన్న ఓ ఆసుపత్రి భవనంపై మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనంపై ఉన్న స్టోర్ రూంలో ఉన్న పాత పేపర్లకు అకస్మాత్తుగా నిప్పు అంటుకోవడం వలన పొగలు వ్యాప్తి చెందాయి. పొగలను చూసిన ఆసుపత్రి సిబ్బందితో హుటాహుటిన పైకి వెళ్లి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఆసుపత్రికి, రోగులకు ఏమి కాలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.