కుక్కునూరు మండలం మారేడుబాక గ్రామ శివారులో సారా బట్టీలపై ఆదివారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 700 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 30 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రజల ఆరోగ్యాలకు హానికరమైన నాటు సారా తయారీ విక్రయాలు నేరమని తయారుచేసిన లేదా అమ్మకాలు చేసినటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు.