జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై నవీన్ కుమార్ శుక్రవారం తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన మండలంలోని చంద్రమ్మ కాలనీకి చెందిన కొరస రమేష్ కుటుంబానికి ఐదువేల రూపాయల విలువైన బియ్యం, దుప్పట్లు, మరియు నిత్యవసర వస్తువులను అందజేశారు. అలాగే ఆ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు.