మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపులు జరగకుండా వారి రక్షణకు ఆసుపత్రి వర్గాలు పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా పోలీసు ఏఆర్ డిఎస్పీ వి. జి. శ్రీహరి చెప్పారు. ఆసుపత్రులలో మహిళా డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ సహాయకులు, కార్మికుల రక్షణ పరిశీలనకై నియమించిన కమిటీ సభ్యులు గురువారం నూజివీడు స్థానిక గిఫర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేశారు.