ప్రజా సమస్యలు తక్షణం పరిష్కరించేందుకు అధికారులు కలిసి పనిచేయాలని మొగల్తూరు మండల తాహసిల్దార్ కే రాజ్ కిషోర్ అన్నారు. బుధవారం తాహసిల్దార్ కార్యాలయం నందు ఆయన మండల స్థాయి అధికారులకు నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో మొగల్తూరు ఎంపీడీవో చిటికెల త్రిశూల్ పాణి, మొగల్తూరు మండల బస్సు సంవర్ధన శాఖ అధికారిని గొట్టుముక్కల నీలిమ తదితరులు పాల్గొన్నారు.