నరసాపురం పురపాలక సంఘ ఛైర్పర్సన్ బర్రె వెంకటరమణ సోమవారం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన రెండవ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో పేరుకుపోయిన వరద నీటిని తోడేందుకు మోటార్లు ఏర్పాటు చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శుభ్రతా కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.