మైలవరం: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామానికి చెందిన పజ్జురు గోపాలరావు మంగళవారం మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్ పరామర్శించారు. సొంత నిధులతో 5000/- రూపాయలు ఆర్థిక సాయం అందించి, కూటమి ప్రభుత్వం గోపాలరావు కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లెల రాధా, దూరు బాలకృష్ణ, జల్లి కృష్ణ, వాటర్ ప్లాంట్ శీను, పోతురాజు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.